ఇది S/O సత్య మూర్తి మీద నా అభిప్రాయం. ఈ చిత్రం rating అనే చేత్తకు ఆమడ దూరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రం ఒక నీతి చెప్పింది, తండ్రి చెప్పిన నీతిని నువ్వు గుర్తు పెట్టుకో అదే నీకు ఆభరణం.

కానీ చిత్రం మాత్రం తండ్రి తప్పు చెయ్యలేదు అని చెప్పడానికే కొడుకు ప్రయత్నించాడు అన్నట్లు ఉంది. అది లోటు అని అనకూడదు ఎందుకంటే తండ్రి తనకు ఎందుకు ఆదర్శం నిరూపించాడు కొడుకు.

మంచి ఏమిటంటే ఈ చిత్రంలో అమ్మాయిల అబ్బాయిల అసభ్యత్వం తక్కువ ఉంది.

ఇక ఈ చిత్రంలో కొన్ని మంచి సందేశాలు

1. పులి మేక కథ పిల్లలకు సందేశం ఇవ్వడానికే మనం ఇప్పటి వరకూ వాడాం కానీ పెద్దలకు కూడా సందేశం ఇవ్వడానికి వాడి చూపించాడు.

2. మన భూమి కబ్జా చేసారు అని తెలిసాకా అమ్మితే అది మోసం, కానీ అమ్మకా తెలిస్తే అది తప్పు(ఇది సరిగ్గా గుర్తులేదు)

ఇలాంటి నీతి విషయాలు చాలా ఉన్నాయి!

కానీ ముగ్గురు heroins అనవసరం, కానీ తండ్రి మంచితనం తనకు వచ్చింది అని చెప్పడానికి వాళ్ళు ఉపయోగ పడ్డారు.

ఇక చిత్రంలో ఇంకో తప్పిదం వాళ్ళు చాలా ఎక్కువమంది ప్రతినాయకులు. ఒక్కడు తప్ప అందరు ప్రతి నాయాకులు మంచి వాళ్ళగా మారతారు!

నేను rating ఇవ్వను ఎందుకంటే ముందుగా చెప్పినట్టు ఇది కష్టం, ఎందుకంటే నీతికి rating ఇవ్వడం అంత అమాయకత్వం ఉండదు.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.